సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. పోరు గడ్డ ఎగిరి గెంతేసింది. లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటారుు. సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన జిల్లా ప్రజలు ఆనందంతో గంతులేశారు. వీధి వీధినా... పల్లె పల్లెనా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. పిల్లా పాపలు మొదలు వృద్ధుల వరకు... జై తెలంగాణ... జయుహో తెలంగాణ... అంటూ అరుపులు కేకలతో వీధుల్లోకి పరుగులు తీశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే ఆనందంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుులు, వివిధ ప్రజాసంఘాలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌కు తరలివచ్చి జయు జయుధ్వానాలు చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయుకులు... కార్యకర్తలు విజయోత్సాహంతో... వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. ధూం ధాం తీన్‌వూర్ ఆటపాటలతో డాన్సులు చేశారు. టపాసులు కాల్చి... మిఠారుులు పంచిపెట్టారు. జిల్లా కేంద్రం మొదలు అన్ని వుండల కేంద్రాల్లో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకున్నారు. ఎన్నికల తరుణం కావడంతో అన్ని ప్రాంతాల్లో రాజకీయు కోలాహలం కనిపించింది. ప్రధాన పార్టీల నాయుకులు సంబరాల్లోనూ పోటీపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణులు వుుందు వరుసలో నిలబడితే బిల్లుకు వుద్దతునిచ్చిన బీజేపీ నాయుకులు ఆనందంలో పాలుపంచుకున్నారు. ఎవరికి వారుగా తవు పార్టీల జెండాలను విజయు పతాకాలుగా ఎగరేశారు.
వారం రోజుల నుంచే పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై గందరగోళం నెలకొనటం... పెప్పర్ స్ప్రే ఘటనలో ఎంపీ పొన్నం ప్రభాకర్ అస్వస్థతకు గురికావడంతో... జిల్లాలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వుుఖ్యనేతలు ఢిల్లీలోనే ఉన్నారు. వుంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం, వివేక్‌తోపాటు విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, సోవూరపు సత్యనారాయుణ, గంగుల కవులాకర్, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి అక్కడే సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, రవీందర్‌సింగ్, వుహిళా నేతలు కటారి రేవతిరావు, వరాల జ్యోతి... కాంగ్రెస్ తరఫున పార్టీ వుహిళా నేతలు నేరెళ్ల శారద, గందె వూధవి, గుగ్గిళ్ల జయుశ్రీ, గంట కళ్యాణి, నందెల్లి రవు, బీజేపీ తరఫున మీస అర్జున్‌రావు, బండి సంజయ్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సీపీఐ నుంచి వుర్రి వెంకటస్వామి, సృజన్‌కువూర్, పైడి రాజు, జేఏసీ తరఫున వెంకటవుల్లయ్యు, జక్కోజు వెంకటేశ్వర్లు సారథ్యంలో భారీగా తరలివచ్చిన ఉద్యవుకారులు ఆనందోత్సాహాల్లో పాలుపంచుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సంబరాలకు దూరంగా ఉంది. జగిత్యాలలో స్థానిక టీడీపీ నాయుకులు కొందరు వీధుల్లోకి వచ్చినప్పటికీ... మిగతా సెగ్మెంట్లలో ఆ పార్టీ ఊసే కనిపించలేదు.
వుుగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వుుఖం చాటేశారు. మొన్నటివరకు పాదయూత్ర చేసిన ఎమ్మెల్యే విజయురవుణారావుతోపాటు ఎల్.రవుణ, సుద్దాల దేవయ్యు జిల్లాలో అందుబాటులో లేకుండా... రాజధానిలో వుకాం పెట్టారు. సీనియుర్ నాయుకులు కళ్యాడపు ఆగయ్యు, దామెర సత్యం సారథ్యంలో కొందరు టీడీపీ నేతలు జెండాలతో బయుల్దేరినప్పటికీ.. తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. జెండాలు కింద పడేసి తవుు్మళ్లను దూరంగా తరిమికొట్టారు. జిల్లా కేంద్రంలో ఆ నాయకులు మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నావుని... తెలంగాణకు వుద్దతుగా తవు పార్టీ లేఖ ఇచ్చినందుకే రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకున్నారు. కలెక్టరేట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయూల్లో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు.
సంబురం
Published Wed, Feb 19 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement