సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూలును ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. జూనియర్ లెక్చరర్లు ఆదివారం లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 13కల్లా ప్రింట్ కాపీ, సర్టిఫికెట్లను జిల్లా ఇంటర్ విద్యాధికారికి అందజేయాలని సూచించింది. ఖాళీలను 13న ప్రకటిస్తామని తెలిపింది. వాటిపై 14న అభ్యంతరాలను స్వీకరిస్తామని, సవరించిన జాబితాలను 15న ప్రకటిస్తామని చెప్పింది. బదిలీలకు అర్హులైన వారి జాబితాను 17న ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని, 21న బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను ప్రకటిస్తామని వివరించింది.
ఉద్యోగులు ఈనెల 22 నుంచి 24వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న బదిలీ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే డిగ్రీ కాలేజీల్లో ఈనెల 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఖాళీలను 9న ప్రకటించి 10, 11 తేదీల్లో వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. 12న ఫైనల్ ఖాళీల జాబితాను ప్రకటించి, 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను 18న ప్రకటించి, 20న బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment