పులివెందుల, న్యూస్‌లైన్ : కేంద్రం దిగివచ్చేదాకా సమైక్య ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యమకారులు తేల్చిచెప్పారు. శనివారం పులివెందులలో నిర్వహించిన పులికేకలో సమైక్యవాదులు సమర శంఖం పూరించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి మైదానం మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు, వ్యాపారస్తులు, సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది.
ఇసుక వేస్తే రాలనంత జనంలో ఎక్కడ చూసినా సమైక్యవాదులే కనిపించారు. మైదానంలో స్థలం లేకపోవడంతో రోడ్డుపైనుంచే పులికేకలో పాల్గొని మద్దతును తెలియజేశారు. సమైక్యవాదులకు ఎలాంటి ఆటంకం లేకుండా పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు వేసి బారీకేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు చిన్నారులు కూర్చొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆకట్టుకున్న సాంసృ్కతిక
కార్యక్రమాలు :
పులివెందులలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు వైఎస్‌ఆర్ సీపీ సాంసృ్కతిక విభాగపు కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని రగిలించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సమైక్యాంధ్ర లక్ష్మిపూజ సాంప్రదాయబద్ధంగా నిర్వహించి పులికేకను ప్రారంభించారు. సభ ప్రారంభంకాగానే జేఏసీ చైర్మన్ నరసింహారెడ్డి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞను చేయించారు. ఉద్యమంలో అశువులు బాసిన సమైక్యవాదులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆపేది లేదు
Published Sun, Sep 29 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement