ఆయనను సస్పెండ్ చేయాల్సిందే.. | Him to be suspended .. | Sakshi
Sakshi News home page

ఆయనను సస్పెండ్ చేయాల్సిందే..

Published Fri, Feb 14 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Him to be suspended ..

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ట్రెజరీ డిప్యూటీ డెరైక్టర్ రంగప్పను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా ట్రెజరీ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
 ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై డీడీ రంగప్ప వేధింపులు, బెదిరింపులు అధికమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకునేవరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన, వర్క్ టు రూల్ లాంటి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ సబ్ ట్రెజరీ అధికారి కె.అనురాధమ్మ,  సబ్ ట్రెజరీ అధికారి ఎస్.అమీనుద్దీన్ కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement