సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ప్రజలు పోరుబాటలో సాగుతున్నారు. ఉద్యోగులు ఉద్యమ బాట వీడినా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సమైక్య రాష్ట్రం కోసం పాటుపడకపోయినా.. సామాన్యులు మాత్రం వైఎస్సార్‌సీపీ అండతో అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడంతో జిల్లాలోని సమైక్యవాదుల్లో రెట్టింపు ఉత్సాహం కన్పిస్తోంది. అదే ఉత్సాహంతో 88వ రోజైన శనివారం జిల్లాలో సమైక్య పోరు జోరుగా కొనసాగించారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ’ అంటూ విద్యార్థులు మౌనప్రదర్శన చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తలుపులలో రాస్తా
రోకో నిర్వహించారు. క ళ్యాణదుర్గంలో మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, జేఏసీ నాయకులు ర్యాలీలు చేపట్టారు. విద్యార్థులు స్థానిక టీసర్కిల్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో నిలబడి నిరసన తెలిపారు. గోరంట్లలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలోని పోలీసుస్టేషన్ సర్కిల్‌లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో విద్యార్థులు మానవహారం నిర్మించారు.
పోరు బాట
Published Sun, Oct 27 2013 3:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement