కొడంగల్, న్యూస్‌లైన్: పాలమూరు ఎత్తిపోతల పథ కం నిర్మాణంతోనే జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలంటే వేరుపడాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను గుర్తించి వారి న్యా యం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం కొడంగల్ పట్టణంలో జరిగిన విద్యార్థి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన ను వెంటనే అమలు చేయాలన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమో దం పొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజల నోటికాడి బుక్కను సీమాంధ్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీళ్లు, కరెంట్, బొగ్గు, వనరులు, ఉద్యోగాలు, సంప ద ఈ ప్రాంతం వారికే దక్కాలన్నారు. సీమాంధ్ర పెత్తందారులు ఆ ప్రాంత ప్రజలకు లేనిపోని భయాలను సృష్టిం చి వారిలో అనుమానాలు రేకెత్తిస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ తె లంగాణ ప్రజలహక్కు అని అన్నారు. మూడేళ్లవరకు హైదరాబాద్‌లో కలిసి ఉండి ఆ తర్వాత ఖాళీచేసి వెళ్లిపోవాలని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రా లు, పరాయి దేశస్తులు ఉన్న హైదరాబాద్‌లో వారికి లేని భయాలు సీమాం ధ్రులకు ఎందుకోసమని కోదండరామ్ ప్రశ్నించారు.
వారి రక్షణ కోసం చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ 29వ రాష్ర్టం గా ఏర్పడిన తర్వాత కూడా భారత రాజ్యాంగమే అమల్లో ఉం టుందన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ జిల్లా చైర్మ న్ రాజేందర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు కరాటే రాజు, టీవీ వీ జిల్లా కన్వీనర్ రవీందర్‌గౌడ్, టీఎ న్‌జీఎస్ తాలూకా కన్వీనర్ బాకారం శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాస్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, రాజేంద్రబాబు తదితరు లు పాల్గొన్నారు.
న్యాయం జరగాలంటే వేరు పడాల్సిందే
Published Fri, Oct 25 2013 3:12 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement