నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఆదివారం ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేసిన ఉద్యోగులు సమ్మెకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల 8 గంటలకు నిలిచిపోయింది. రాత్రి వరకు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. అత్యవసర
సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
వివేకా ఇంటికి కరెంట్ బంద్
జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్‌లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు.
కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 2ృ0 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడృకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ృగారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్‌లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని ృ00 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు.
రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత
విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సవెృ్మలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గృడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పినాకిని, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి.
చీకట్లో ఇక్కట్లు
సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
06ఎన్‌ఎల్‌ఆర్91-సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు
92- సబ్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సిబ్బంది సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
వివేకా ఇంటికి కరెంట్ బంద్
జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్‌లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు.
కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ది గారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్‌లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని 400 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు.
రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత
విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సమ్మెలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజిల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి.
చీకట్లో ఇక్కట్లు
సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
విభజన చీకట్లు
Published Mon, Oct 7 2013 4:09 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement