సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సముద్ర కెరటంలా ఎగిసిపడుతోంది. రాష్ట్ర విభజనకు నిరసనగా 74వ రోజూ ఉద్యమ హోరు కొనసాగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరులోని ఎన్జీఓ భవన్‌లో వైద్య విధాన ప రిషత్ ఉద్యోగులు రిలేదీక్ష చేయగా, రా మలింగాపురం కూడలిలో విద్యార్థి జేఏ సీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్‌జీఓ హోమ్ వరకు ర్యాలీ చేశారు. ఉదయగిరి, వింజమూరులో జేఏసీల ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. విం జమూరులోని దీక్షా శిబిరంలో సాతానువారిపాళెంనకు చెందిన యువకులు కూర్చున్నారు. ఉదయగిరిలోని శిబిరం లో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు దీక్ష చేపట్టారు. బెలూన్లతో నిరసన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన రిలే దీక్షలో సీతారామపురం మండల వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. సో నియా గాంధీ, దిగ్విజయ్, షిండే దిష్టిబొమ్మలకు గూడూరులోని టవర్‌క్లాక్ ప్రాంతంలో జేఏసీ నాయకులు సమాధులు కట్టారు. వైఎస్సార్‌సీపీ గూ డూరు నియోజకవర్గ సమస్యకర్త పాశం సునీల్‌కుమార్ సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోటుపాళెం కూడలి ప్రాంతంలో రాస్తారోకో జరిగింది. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండు ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీధర్ అనే యువకుడు గుండు కొట్టించుకుని నిరసన తెలిపాడు. కావలిలో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ మండలాల్లోనూ రిలేదీక్షలు జరిగాయి. తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరైనా సంతకాలు పెట్టకుండానే పనిచేస్తామని ఎన్జీఓలు తెలిపారు.
ఉద్యమ కెరటం
Published Sun, Oct 13 2013 4:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement