పీఎస్ ప్రద్యుమ్న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక ప్రజాసమస్యలపై దృష్టి సారించారు. అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేశారు. అయితే, నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచే కొందరు అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ ఆశయానికి గండి కొడుతున్నారు. ఆయననే తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందూరు జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు, ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న 2013 సెప్టెంబర్ 4న కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను ఈ నంబరుకు ఫోన్ చేసి చెబితే, వాటిని సత్వరమే పరి ష్కరించేలా చూస్తామని ప్రకటించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కొందరు అధికారులు ఇక్కడా తమ నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోయినా, పరిష్కారం అయిందని టోల్‌ఫ్రీ కేంద్రానికి సమాచారమిస్తున్నారు. దీంతో ప్రజలు విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సంఘటనే ఒకటి గురు వారం వెలుగులోకి వచ్చింది.
వీధి దీపాలు వెలగడం లేదని
నగరంలోని కోటగల్లి భగత్‌సింగ్ చౌరస్తా నుంచి ఇందిరాగాంధీ పార్కు వరకు ఉన్న వీధి దీపాలు కొద్ది రోజులుగా వెలగడం లేదు. రాత్రిపూట ఆ ప్రాంతంలో చీకటి అలుముకుంటోంది. ఈ ప్రాంతవాసులు నడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతల గంగాదాస్ అనే స్థానికుడు గత నవంబరు 27న ఈ విషయాన్ని టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేశారు. (ఫిర్యాదు నం58886).
టోల్ ఫ్రీ నిర్వాహకులు సమస్యను కంప్యూటరీకరించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. 15 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. సంబంధి త అధికారులులెవరూ స్పందించలేదు. కనీసం సమస్య ను తెలుసుకోడానికి కూడా ప్రయత్నించ లేదు. దీంతో గంగాదాస్ డిసెంబరు 16న తిరిగి ఫిర్యాదు (59693) చేశారు. టోల్‌ఫ్రీ నిర్వాహకులు ఈ ఫిర్యాదును మరోసారి మున్సిపల్ అధికారుల దృషికి తీసుకెళ్లారు. ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమైపోయిందని వారు సమాధానమివ్వడంతో, అదే విషయాన్ని వారు కంప్యూటర్‌లో నమోదు చేశారు.
అసలు విషయం ఇది
ఇక్కడ వీధి దీపాలు మాత్రాలు వెలగలేదు. గంగాదాస్ గురువారం ఉదయం మరోసారి టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమైందని అక్కడి సిబ్బం ది చెప్పడంతో నివ్వెరపోయారు. అసలు విషయం ఆరా తీసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. సమస్య పరిష్కారమైం దని కంప్యూటర్‌లో స్పష్టంగా నమోదు అయి ఉండడాన్ని చూసి ఖంగు తిన్నారు. దీంతో మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని తేలిపోయింది. ఇక ఆయన చేసేదేమీ లేక కలెక్టర్‌నే నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో నిజాలెన్నో
టోల్ ఫ్రీ సెంటర్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 2,581. ఇందులో వాస్తవంగా ఎన్ని పరిష్కారమయ్యాయో తెలియదు. తప్పుడు సమాచారాలెన్నున్నా యో కూడా తెలియదు. ఫిర్యాదుదారులు సుదూర ప్రాం తాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణికి వస్తున్నారని ఆలోచించిన కలెక్టర్, వారి ఇబ్బందు లను తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. కొందరు అధికారులు అతి తెలివి చూపించి కలె క్టర్‌నే బురిడీ కొట్టిస్తున్నారు.
ఇలా అయితే ఎలా సారూ!
Published Fri, Jan 3 2014 4:01 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM
Advertisement
Advertisement