JAC chairman
-
ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదు: బొప్పరాజు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. కాగా, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు. 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారు. జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘కన్నా లక్ష్మీనారాయణ నీ చరిత్ర నాకు తెలుసు..’ -
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
తెలంగాణలో జీతాలు పెంచాలని ఉద్యోగులు రోడెక్కారు : బొప్పరాజు
-
‘కోదండ రాం మాకు ప్రత్యర్థి కాదు’
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాకు ప్రత్యర్థి కాదని, అలాగే ఆయన కాంగ్రెస్ ఏజెంట్ కాదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణాలో టీఆర్ఎస్తో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని..పొత్తులకు చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు. వాటి గురించి పీసీసీ చీఫ్ స్పందిస్తారని తెలిపారు. కోదండరాం గొప్ప వ్యక్తి అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మాదిరి అన్ని వర్గాలను కలుపుకుని వెళతామని, టీఆర్ఎస్ ఓడిపోతుందనే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, దీనికి కోసం చాలా మందితో ఉత్తమ్ మాట్లాడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి రావాలని, త్వరలో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని, జూన్2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ వారం టీఆర్ఎస్, టీడీపీ నుంచి పలువురు ముఖ్యులు కాంగ్రెస్‌లో చేరతారని, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డిని వద్దని పార్టీలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నామని, ప్రవాస గల్ఫ్ ఎన్నారైలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని వివరించారు. ఈ నెల 12 నుంచి కాంగ్రెస్ బృందం కువైట్‌లో పర్యటిస్తుందని, గల్ఫ్‌లో క్షమాబిక్ష (ఆమ్నెస్టీ )పథకంలో..ముప్పై వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని, ఆ కార్మికులకు ఫ్రీ టికెట్ లు అందించాలని కోరారు. గల్ఫ్ ఎన్నారైల భాదలు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటం లేదన్నారు. కువైట్‌కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపించి..ఎన్నారై పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘సీఎం సీమాంధ్ర జేఏసీ చైర్మన్’
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ :రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్ ఆరోపించారు. జిల్లాకు రూ.60 నుంచి రూ.70 లక్షలు ఇస్తూ సమైక్యవాదులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రులు చేస్తున్నది కత్రిమ, కిరాయి ఉద్యమమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదని, ప్రత్యేకరాష్ట్రం కోసం ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారో సీమాంధ్రులు గమనించాలని హితవు పలికారు. అరవయేళ్ల తెలంగాణ పోరాటంలో తెలంగాణలోని ఆంధ్రులకు ఎప్పుడైనా హాని తలపెట్టామా అని ప్రశ్నించారు. పదమూడు రోజుల సమైక్యాం ధ్ర ఉద్యమంలో ఆంధ్రాలో ఉన్న తెలంగాణ వారికి హాని తలపెట్టడం ఏం సంస్కృతి అని నిలదీశారు. ఉద్యమంలో తెలంగాణవాదులపై పోలీసులు లెక్కలేనన్ని కేసులు పెట్టి హింసించారన్నారు. సీమాంధ్రులు పోలీసుల ముందే దేశ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే కేసులు పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపై సీమాంధ్ర నాయకులు హెచ్చరికలు చేసిన పోలీసులు సుమోటో కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరాం, సత్యనారాయణగౌడ్, సత్తెక్క, సారా సు రేశ్, కిషన్, అశోక్, బాలయ్య పాల్గొన్నారు.