సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్‌లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మందకృష్ణ అరెస్టు..
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష
చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన
సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్‌ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు
Comments
Please login to add a commentAdd a comment