అశ్వద్ధామ రెడ్డి(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ఆర్‌టీసీ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె తర్వాత లాంగ్ లీవ్‌లో ఉన్న అశ్వద్ధామ రెడ్డి నెలలు గడుస్తున్నా విధులకు హాజరు కాకపోవటంతో ఆర్టీసీ యాజమాన్యం ఈ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ, దీర్ఘకాల సెలవుల అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. అయినప్పటికి మరోసారి ఎక్స్‌ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం ఆయన దరఖాస్తు చేయగా రెండోసారి కూడా యాజమాన్యం తిరస్కరించింది. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. అయినప్పటికి ఆయన విధుల్లో చేరకపోవటంతో షోకాజ్ నోటీస్ జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment