సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
దీక్ష విరమించిన జేఏసీ నేతలు
మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment