ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం | 17th Day Of TSRTC Strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం

Published Tue, Oct 22 2019 2:47 AM | Last Updated on Tue, Oct 22 2019 8:52 AM

17th Day Of TSRTC Strike - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. సోమవారం 17వ రోజు రాష్ట్రవ్యా ప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేశారు. బస్‌ డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. వేతనాలు లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలంటూ తాత్కాలిక డ్రైవర్లు, కం డెక్టర్లను వేడుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ సర్కారుపై మండిపడ్డారు. కరీంనగర్‌–1 డిపోకు చెందిన డ్రైవర్‌ జంపన్న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మిక వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

విద్యార్థుల అవస్థలు.. 
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆరీ్టసీని ఆదేశించింది. ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. తక్కువ బస్సులే రోడ్డెక్కడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ పరిధిలో 2 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది. అయితే, కేవలం 859 బస్సులు మాత్రమే నడపగలిగారు. అవి కూడా సమయానుకూలంగా నడవలేదు. ఫలితంగా గంటల తరబడి వేచి చూడాల్సి వచి్చంది. విద్యార్థుల బస్‌ పాస్‌లను అన్ని బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆదేశించినప్పటికీ చాలాచోట్ల పాసులను అనుమతించలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6,276 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది.

గవర్నర్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ 
ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, బీఎస్‌ రావు, సుధ తదితరులు సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని, చర్చలు జరిపేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. సమ్మె జరుగుతున్న సమయంలో అద్దె బస్సులు పెంచేలా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన అంశాన్ని కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పరిస్థితిని వివరించారు. తమ వినతిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.

ఎంజీబీఎస్‌లో అఖిలపక్షం ధర్నా.. 
సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖ రికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌)లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్‌ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.

నూరు శాతం బస్సులు నడపాలి
నూరుశాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కండక్టర్లు ప్రయాణికులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాసులను అనుమతించాలని స్పష్టంచేశారు. కండక్టర్లకు టిమ్‌ మెషీన్లు ఇవ్వాలని సూచించారు. అవసరాన్ని బట్టి బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎల్రక్టీíÙయన్లను నియమించుకోవాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement