సాక్షి, హైదరాబాద్: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్‌ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు.
చదవండి:
కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment