నరసన్నపేట: ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అధికార వికేంద్రీకరణకే కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించి నష్టపోలేమని అన్నారు. 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన జంట నగరాలను విభజన కారణంగా కోల్పోయామని, ఇది పునరావృతం కాకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా అమరావతిలో మాత్రమే కాకుండా మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని జనం కోరుకుంటున్నారని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మళ్లీ విభజన ఉద్యమాలు రాకూడదంటే అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆయన తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు.
వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం
Published Mon, Mar 7 2022 5:14 AM | Last Updated on Mon, Mar 7 2022 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment