
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు.
చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు.
చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
Comments
Please login to add a commentAdd a comment