‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైంది’ | 'The Decision Of Decentralization Taken By The AP Government Is Fair Sajjala | Sakshi
Sakshi News home page

‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైంది’

Published Mon, Nov 28 2022 3:21 PM | Last Updated on Mon, Nov 28 2022 3:38 PM

'The Decision Of Decentralization Taken By The AP Government Is Fair Sajjala - Sakshi

కర్నూలు: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టులో భిన్న తీర్పులు వచ్చాయని, అయితే ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సజ్జల.

ఈరోజు(సోమవారం) కర్నూలులో మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి, ఆయన తీసుకున్న నిర్ణయానికి ఏపీలో‌ ప్రజలు మద్దతు ఇస్తున్నారు..స్వాగతిస్తున్నారు. చట్టం కూడా  సీఎం వైఎస్ జగన్‌కు సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు కుట్రలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది. ఒకే చోట రాజధాని కట్టాలని హైకోర్టు చెప్పడం సరైనది కాదు, దానిపై సుప్రీంకోర్టు తప్పుపట్టి, ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్, రామోజీ రావు కోరిక చంద్రబాబు సీఎం కావాలనేది. కానీ ఇది ప్రజలు తప్పుపడుతున్నారు.  పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరిక లేదు. చంద్రబాబు సీఎం కావాలని ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు’ అని సజ్జల పేర్కొన్నారు.

చదవండి:  రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement