
తిరుపతిలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకుల ర్యాలీ
తిరుపతి కల్చరల్: తన పుట్టుకకు, ఉన్నతికి దోహదపడిన రాయలసీమ అంటే గిట్టకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు నాయుడని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ హిందూస్థాని విమర్శించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి, మూడు రాజధానుల ఏర్పాటు కోరుతూ ఆప్స్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో ర్యాలీ చేపట్టారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆంధ్రా బ్యాంక్ సర్కిల్ నుంచి ఎంఆర్ పల్లి సర్కిల్ వరకు విద్యార్థులు, యువకులు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు.
రఫీ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పేరుతో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రైతుల వేషంలో టీడీపీ, కమ్యూనిస్టులు, జనసేన నేతలు తిరుపతిలో యాత్ర సాగించడం రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే చంద్రబాబుకు నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్పొరేట్ యాత్రకు కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని విమర్శించారు. అలాగే, సీమ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరిన కమ్యూనిస్టులు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని రఫీ అన్నారు.
రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి నగరంలో పాదయాత్ర చేయడం భావ్యం కాదన్నారు. ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహ్మద్ రఫీ, రచయిత్రి డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధికి యువత ముందుకు రావాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ శ్రీభాగ్ ఒప్పందానికి విఘాతం కలిగించిందన్నారు. అనంతరం ఎంఆర్ పల్లి సీఐ సురేంద్రరెడ్డి అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకుని 20 మంది ఆప్స్ నేతలను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment