AP Govt Petition In SC Against Sivaramakrishnan Committee Recommendations - Sakshi
Sakshi News home page

శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి: రాజధానిపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం 

Published Fri, Feb 10 2023 11:34 AM | Last Updated on Fri, Feb 10 2023 12:57 PM

AP Govt Petition In SC Against Sivaramakrishna Committee Recommendations - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 

శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఇవే.. 
- ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. 
- రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. 
- ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. 
- విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి. 

- అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. 
- హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి. 
- రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. 

- ముఖ్యంగా(గుంటూరు-విజయవాడ మధ్య) సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. 
- విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. 
- అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమాగ్రాభివృద్ధికి విధివిధానాలను రూపొందించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement