తిరుపతిలో భారీ ర్యాలీ.. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు | Tirupati: Students Conduct Rally Support AP Development Decentralization | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భారీ ర్యాలీ.. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు

Published Thu, Dec 16 2021 2:16 PM | Last Updated on Thu, Dec 16 2021 2:20 PM

Tirupati: Students Conduct Rally Support AP Development Decentralization - Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి వికేంద్రీకరణపైనే చర్చ సాగుతోంది. మూడు రాజధానులకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. సభలు, సమావేశాల రూపంలో రాయలసీమ సమాజం చైతన్యవంతమవుతోంది. అందులో భాగంగానే అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం​ మారుమోగింది. కృష్ణాపురం పోలీసు స్టేషన్‌ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులు, మేధావులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు.

చదవండి: ‘సీఎం కప్‌ గెలిస్తే.. నా రెండు నెలల వేతనం ఇస్తా’

అడుగడుగున ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాయలసీమ మేధావులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement