
సాక్షి, విజయనగరం: మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ కూడా పరిపాలనా వికేంద్రీకరణ అనే స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికనే మేం బలంగా నమ్ముతున్నాం. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను టీడీపీ తమ స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టింది. పోలవరం నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. జిల్లాల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు, కమిటీ పరిశీలిస్తుంది' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
చదవండి: (అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి)