sivaramakrishnan committee report
-
ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలుచేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీలో రాజధాని ఎలాంటి ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్న అంశంపై కమిటీ తగిన నివేదిక ఇచి్చందంటూ గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్ వలి తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి గురువారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కమిటీ నివేదికకు విరుద్ధంగా ఒకే ప్రాంతంలో అభివృద్ధిచేయాలని 2014లో ఏర్పడిన ప్రభుత్వం చూసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసినప్పటికీ ఇటీవల ఏపీ హైకోర్టు అమరావతిని రాజధానిగా అభివృద్ధిచేయాలని ఆదేశించిందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కమిటీ నివేదిక ఇచ్చిందని.. ఒకే ప్రాంతంతో అభివృద్ధిచేయాలని చెప్పడం సరికాదన్నారు. రాజధానికి సంబంధించి కమిటీ పలు ప్రాంతాలు సూచించినప్పటికీ నాటి ప్రభుత్వం వాటిని విస్మరించిందని పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: ఎలాగైనా సరే లోకేశ్ పాదయాత్రకు హైప్ తేవాలి.. బాబు కుయుక్తులు? -
ఆ నివేదికనే మేం బలంగా నమ్ముతున్నాం: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ కూడా పరిపాలనా వికేంద్రీకరణ అనే స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికనే మేం బలంగా నమ్ముతున్నాం. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను టీడీపీ తమ స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టింది. పోలవరం నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. జిల్లాల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు, కమిటీ పరిశీలిస్తుంది' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: (అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి) -
అనారోగ్యంతో శివరామకృష్ణన్ మృతి
-
అనారోగ్యంతో శివరామకృష్ణన్ మృతి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ ఐఎఎస్ అధికారి శివరామకృష్ణన్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. శివరామకృష్ణన్ నేతృత్వంలో కమిటీ 187 పేజీల నివేదికను సమర్పించింది. -
'శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బయటపెట్టాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... శివరామకృష్ణ కమిటీపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. అందుకు లక్ష ఎకరాలు అవసరం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి 10 నుంచి 15వేల ఎకరాలు సరిపోతాయన్నారు. చట్టబద్ధత లేని లాండ్ పూలింగ్ విధానంతో రైతులను బెదరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. -
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై రాయపాటి సంచలన వ్యాఖ్యలు
గుంటూరు: ఏపి రాష్ట్ర రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికపై ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీ సభ్యులకు దొనకొండ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. వారికి భూములున్న కారణంగా వారు ఆ ప్రాంతం రాజధానికి అనువైనదిగా చెప్పుకొస్తున్నారన్నారు. ఏదిఏమైనా విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని రాయపాటి చెప్పారు. ఏపి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ కేంద్ర అర్బన్ డవలప్మెంట్ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.శివరామకృష్ణన్ కాగా, సభ్యులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పోలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్ రాయ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమర్ రేవి, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ జగన్ షా, న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కీటెక్చర్ మాజీ డీన్ కె.టి.రవీంద్రన్ ఉన్నారు. ఈ కమిటీ ఈ నెల 27న కేంద్ర హొం శాఖకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. రాయపాటి వ్యాఖ్యలు వివాదానికి దారితీసే అవకాశం ఉంది. -
శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం
-
ఏపి రాజధానిపై కేంద్రానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. నూతన రాజధానిపై నివేదికను కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు వివరామకృష్ణన్ అందజేశారు. రాజధానిపై కమిటీ పలు ఆప్షన్లను ఇచ్చింది. విజయవాడ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదని కమిటీ పేర్కొంది. వ్యవసాయ భూములు సేకరించడం కష్టం అని తెలిపింది. విజయవాడలో వ్యవసాయ భూముల లభ్యంతపై కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రముఖ సంస్థను ఏర్పాటు చేయాలని కమిటీ నివేదికలో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరించాలని కమిటీ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పారిశ్రామికాభివృద్ధిపై కమిటీ పలు సూచనలు చేసింది.కోస్తా ఆంధ్రలో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నందున పెద్ద ఎత్తున భూసేకరణ కష్టమని కమిటీ తెలిపింది.