ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన శివరామకృష్ణన్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ ఐఎఎస్ అధికారి శివరామకృష్ణన్ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. శివరామకృష్ణన్ నేతృత్వంలో కమిటీ 187 పేజీల నివేదికను సమర్పించింది.