
శివరామకృష్ణన్
న్యూఢిల్లీ: శివరామకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. నూతన రాజధానిపై నివేదికను కేంద్ర హొం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్కు వివరామకృష్ణన్ అందజేశారు. రాజధానిపై కమిటీ పలు ఆప్షన్లను ఇచ్చింది. విజయవాడ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదని కమిటీ పేర్కొంది. వ్యవసాయ భూములు సేకరించడం కష్టం అని తెలిపింది. విజయవాడలో వ్యవసాయ భూముల లభ్యంతపై కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.
రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రముఖ సంస్థను ఏర్పాటు చేయాలని కమిటీ నివేదికలో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరించాలని కమిటీ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పారిశ్రామికాభివృద్ధిపై కమిటీ పలు సూచనలు చేసింది.కోస్తా ఆంధ్రలో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నందున పెద్ద ఎత్తున భూసేకరణ కష్టమని కమిటీ తెలిపింది.