గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకే తమ మద్దతని రాష్ట్ర నూర్‌బాషా(దూదేకుల) సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్వర్ణాప్యాలెస్ హోటల్‌లో ఆదివారం నూర్ బాషా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో విభజనవాదం తలెత్తదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని తమ సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్న పథకాలు నూర్‌బాషాలకు అందుతున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి షాన్ బాషా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.బాదుల్లా, ఉపాధ్యక్షుడు మదీనా, అధికార ప్రతినిధి, గాజుల బాజీ, యూత్ ప్రెసిడెంట్ శ్రీనుబాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment