సాక్షి, తిరుపతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఏపీ వాణిజ్య వ్యవస్థలో పునర్‌వ్యవస్థీకరణ చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌పై మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి. కమిటీ సమావేశంలో వ్యాపారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. విపక్షాలకు చెందిన మీడియా ఎప్పుడూ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘2019లో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాం. భారత దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్రానికి రూ.12వేల కోట్లు నుంచి రూ.13,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాం. రాష్ట్రాభివృద్ధి కోసం తెచ్చిన అప్పుల వివరాలను ఏనాడు దాచిపెట్టలేదు. కాగ్, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజాలు తెలుసుకోండి’అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన.
టీడీపీ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదని ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో తప్ప అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు జనసేన మధ్య ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎన్నిసార్లు విడాకులు అయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఓపిక ఉండాలి, పవన్ కల్యాణ్ వాఖ్యలు సరికావు.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభవృద్ధి సాధించాలి. ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయి. వీటిని తొలగించడానికే అభివృద్ధి వికేంద్రీకరణ. కర్నూలులో కోర్టు, విశాఖలో సెక్రటేరియట్, గుంటూరులో అసెంబ్లీ పెట్టడం తప్పా? తాను చేసిందే సరి అంటాడు చంద్రబాబు, ఆయన పాలసీలో నిలకడ లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఒకే పార్టీతో ఎన్నిసార్లు కలుస్తారు. ప్రజాస్వామ్య విలువల్ని ఏనాడు చంద్రబాబు పాటించలేదు’ అని ఆయన టీడీపీపై ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment