సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ సాధనకై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మేధావులు, ఉద్యోగులు, వివిధ రంగా నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు, మేధావులు, వివిధ రంగాలు నిపుణులు ఏమన్నారంటే
► సమావేశం సందర్భంగా పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం.
►పరిపాలన రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం
►ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని అరసవల్లి పాదయాత్ర చేస్తారా?
►రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.
►విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.
►విశాఖను పరిపాలన రాజధానిగా కాపాడుకొనేందుకు ఎటువంటి త్యాగలుకైనా సిద్ధం.
►వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు, అయ్యన్న, బండారుకు తగిన బుద్ధి చెబుదాం.
►ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకుంటున్నారు.
►లక్షలు కోట్ల పెట్టి ఖర్చు అమరావతి నిర్మించడానికి డబ్బులు ఎక్కడివి?
►హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళ సమయం ఉన్న ఎందుకు చంద్రబాబు అమరావతి వచ్చారు?
►ఈ నెల 15 తేదీన జరిగే విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం.
►విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు.
Comments
Please login to add a commentAdd a comment