సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులు మా పార్టీ విధానమైతే.. పవన్ కల్యాణ్‌ది మూడు పెళ్లిళ్ల (ఇప్పటికి) విధానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. పెళ్లి చేసుకున్న చోటల్లా రాజధాని పెట్టమంటారా? అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పవన్ కల్యాణ్‌కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవని, ఒకవిధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరినీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తాడేమోనని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ వంటి ఉగ్రవాదులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నాడని నాలుగు రోజుల క్రితమే చెప్పానని, ఆ విధంగానే ఆయన విశాఖలో దిగగానే ఆ పార్టీకి చెందిన సైకోలు తమ పార్టీ నేతలపై దాడులకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడు బాణి వినిపించడానికే.. జనవాణి పేరుతో పవన్ కల్యాణ్ విశాఖ వచ్చాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గడాఫీతో పోల్చడం దారుణం అని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
బాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన
► ప్యాకేజీ స్టార్ అనే పదానికి అర్థం ఏమిటో విశాఖ ప్రజలకు పవన్ కల్యాణ్ బాగా అర్థం అయ్యేలా చెప్పాడు. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర జేఏసీ సభ ఉంటే.. సాయంత్రం దానిని నేను డైవర్ట్ చేస్తానని చంద్రబాబు తరఫున పవన్ కల్యాణ్ రెడీ అయ్యాడు. తన విశాఖ పర్యటనను మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పటం సిగ్గు చేటు.
► చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన. దీనికి బాబు సేన అని పేరు పెడితే బాగుంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని ఈనాడు పత్రిక టార్గెట్ చేయటం, ఉత్తరాంధ్రలో ప్రైవేటు వ్యక్తుల భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం మీద నెట్టటానికి టీడీపీ, ఎల్లో మీడియా, దానితోపాటు జనసేన, ఇతర పార్టీలు ప్రయత్నం చేయటం.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.
యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరు?
► మంత్రులపై రాళ్లు వేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా? పవన్ కల్యాణ్ మద్దతు మీడియా, ఎల్లో మీడియా, బాబు మీడియా.. ఏం చెప్పింది? జనసేన వారే దాడి చేశారని చెప్పలేదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అంటాడు.. ఎవరైనా పవన్ కల్యాణ్‌పై దాడి చేశారా?
► ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ వారు అమ్మేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, బాబు తన పార్ట్‌నర్‌గా ఉండి అమ్మేసిన ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్.. ఇవన్నీ ‘విశాఖ గర్జన’ ఉద్యమం రోజునే పవన్‌కు గుర్తుకు రావడం వెనుక డ్రామా ఏంటో అందరికీ తెలుసు.
► తుపాకీతో కాల్చాలన్న కోరిక ఉన్నవాడిని.. ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ బెదిరించే వాడిని.. సోషల్ ఎలిమెంట్ అంటారా? యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా? జనసేన కార్యకర్తలు హత్యాయత్నం చేసిన విషయాన్ని ఎల్లో మీడియానే నిన్న వీరగాధ అన్నట్టు చూపింది. అది నిజం అయినప్పుడు.. 307 సెక్ష¯Œన్ కింద పోలీసులు కేసులు పెట్టక శాలువాలు కప్పి, సన్మానాలు చేస్తారా?
3 నెలల కిందటే టికెట్ బుక్ చేసుకున్నావా?
► పవన్ కల్యాణ్ విజ్ఞత కలిగిన నాయకుడే అయితే, శనివారం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనకు, తమ కార్యకర్తలు, నాయకులే బాధ్యులు అని హుందాగా ఒప్పుకునే వారు. పవన్‌కు ఆ హుందాతనం లేక పోగా, ఆ దాడులు తమకు తామే చేయించుకున్నామని ఆరోపణలు చేయడం శోచనీయం.
► పవన్ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడాన్ని తప్పు పట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తాను విశాఖ పర్యటన కార్యక్రమాన్ని మూడు నెలల కిందటే ఖరారు చేసుకున్నానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండు నెలల కిందటే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్.. మూడు నెలల క్రితమే టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు?
► విశాఖ గర్జన కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచేందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలపై తమ పార్టీ సైకోలను ఉసిగొలిపిన పవన్ ఒక రాజకీయ ఉగ్రవాది. తనవెంట వచ్చే వారంతా తనకు ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నాడు. సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన వారంతా ఓట్లేస్తే ఈ పాటికి ఎంతో మంది సినిమా నటులు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారు.
మూడు పెళ్లిళ్లే జనసేన విధానం!
Published Mon, Oct 17 2022 3:29 AM | Last Updated on Mon, Oct 17 2022 3:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment