
సాక్షి, విశాఖపట్నం: తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు.
శ్రీబాగ్ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నాం. టాప్-5 సిటీస్‌లో విశాఖ ఉంది. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి’ అని తెలిపారు.