మూడే ముద్దు.. అమరావతి యాత్రలో ఊహించని షాక్‌ | Three capitals Posters Welcome Guntur Amaravati farmers Padayatra | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులు ఎందుకు వద్దంటున్నారు?.. అమరావతి యాత్రలో ఊహించని షాక్‌

Sep 15 2022 1:20 PM | Updated on Sep 15 2022 1:32 PM

Three capitals Posters Welcome Guntur Amaravati farmers Padayatra - Sakshi

అమరావతి మహాపాదయాత్ర అవసరం ఏంటన్న ప్రశ్నతో..

సాక్షి, గుంటూరు: అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న వాళ్లకు ఊహించని షాక్‌ తగిలింది. యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ.. ఉమ్మడి గుంటూరులోని చాలా చోట్ల వ్యతిరేక ఫ్లెక్సీలు వాళ్లకు స్వాగతం పలికాయి. 

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవాళ ఆ యాత్ర సాగనుంది. అయితే.. రాత్రికి రాత్రే జంపని, వేమూరు ప్రాంతాల్లో కారుమూరు వెంకటరెడ్డి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ అందులో హైలైట్‌ చేసి ఉంది. మూడు రాజధానుల వల్ల కలిగే ఉపయోగాలు, అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

మరోసారి హైదరాబాద్‌లాగా దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే.. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందుతుందని ఆ ఫ్లెక్సీ ద్వారా యాత్ర చేసేవాళ్లకు అర్థం అయ్యేలా వివరించింది ఉంది. అంతేకాదు అసలు మీ యాత్ర ఎందుకంటే వేసిన ప్రశ్నతో..  యాత్ర చేసే వాళ్లు కంగుతిన్నారు. స్థానికంగా వీటి గురించి చర్చ నడుస్తోంది.

ఇదీ చదవండి: పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement