బహుజనుల అవిశ్రాంత పోరు | 1200th day of the Bahujan Parikarshan Samithi initiation: Andhara pradesh | Sakshi
Sakshi News home page

బహుజనుల అవిశ్రాంత పోరు

Published Wed, Jan 10 2024 5:43 AM | Last Updated on Wed, Jan 10 2024 5:43 AM

1200th day of the Bahujan Parikarshan Samithi initiation: Andhara pradesh - Sakshi

తాడికొండ: రాజధాని పేరిట అమరావతిలో కులవాదుల అరాచకాలు, అవినీతిని ప్రపంచానికి తెలియజేసేందుకు... రాజ్యాంగబద్ధంగా పేదలకు లభించిన హక్కులను కాపాడేందుకు... మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చాటిచెప్పేందుకు బహుజన పరిరక్షణ సమితి అవిశ్రాంత పోరాటం సాగిస్తోంది. రాజధాని ఒక కులానిది కాదని.. అందరిదని చాటిచెబుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తోంది. భవిష్యత్‌లో మరో వేర్పాటువాద ఉద్యమానికి నేడు అమరావతిలో కుల­వాదుల వ్యవహారశైలి, నిర్ణయాలు కారణం కాకూ­డదని పోరాడుతోంది. ఈ మేరకు మూడు రాజ­దానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 1,200వ రోజుకు చేరనున్నాయి.    

ఎక్కడ అన్యాయం జరిగిందో.. అక్కడే పోరాటం  
రాష్ట్ర ప్రభుత్వం 2019, డిసెంబర్‌ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు దొంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేయకుండా కోరుక్టు వెళ్లి స్టేలు తీసుకువచ్చారు. అయితే, మూడు ప్రాంతాల సమానాభివృద్ధితోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ఖజానా మొత్తం ఒకే ప్రాంతానికి దోచిపెట్టడం కారణంగా అందరి హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ బహుజన పరిరక్షణ సమితి నాయకులు 2020, ఫిబ్రవరి 9న ఉద్యమం చేపట్టారు.

ఎక్కడ రాజధాని పేరిట బహుజనులు, పేదల భూములు దోచుకున్నారో.. ఎక్కడ అమాయకులకు అన్యాయం జరిగిందో అక్కడే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, బహుజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రత్యక్షంగా 67 సంఘాలు, పరోక్షంగా దాదాపు 240 సంఘాల నేతలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కులవాదులు, పెత్తందారులు, ఆరి్థక ఉగ్రవాదులు పలుమార్లు ప్రయతి్నంచినప్పటికీ బహుజన నేతలు వెరవకుండా నిరి్వరామంగా తమ పోరాటం కొనసాగిస్తున్నారు.  

మూడు రాజధానుల ద్వారానే బహుజనులకు మేలు 
1,199వ రోజు రిలే నిరాహార దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు 
మూడు రాజధానుల ద్వారానే బహుజనుల ఆర్థిక, సామాజిక ఎదుగుదల సాధ్యమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 1,199వ రోజుకు చేరాయి.

పలువురు నాయకులు మాట్లాడుతూ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచిపని అయినా ఉంటే చూపించి ఓట్లు అడగాలని సూచించారు. విభజన అనంతరం బాబు చేసిన తప్పుడు పనుల కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి పేరుతో కేవలం గ్రాఫిక్స్‌లను ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో ముందస్తు వ్యూహంతో బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి రూ.లక్షల కోట్లు లాభాలు పొందారని ఆరోపించారు.

రిలే నిరాహార దీక్షలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు (ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement