బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం లేదని, ముందు నుంచీ తాము అమరావతికే మద్దతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ప్రకటించక ముందే తాము జనవాణి షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వస్తుండగా ప్రజలకు అభివాదం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓ ఐపీఎస్ అధికారి తన కారెక్కి లోపల కూర్చోవాలని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. తమ పార్టీ ఏం చేయాలో కూడా వైఎస్సార్‌సీపీ చెబుతుందా? అని ప్రశ్నించారు.
పోలీసులు దురుసుగా ప్రవర్తించినా తాను గౌరవంగా వ్యవహరించానని చెప్పారు. వంద మందికిపైగా జనసేన నాయకులను అరెస్ట్ చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వారిని విడిచిపెట్టే వరకు జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి గురించి నిజానిజాలు తెలియాలన్నారు. మంత్రులకు సరైన భద్రత లేకపోవటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.
కోడి కత్తిలా ఇది కూడా ఒక ప్లాన్‌లా అనిపిస్తుందన్నారు. తనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని పదేపదే విమర్శించే వారికి అంత ఈర‡్ష్య ఎందుకని ప్రశ్నించారు. వారు కూడా విడాకులిచ్చి పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కాగా విశాఖలో ఈ నెల 31 తేదీ వరకు ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నోటీసు అందించారు. దీనిపై పవన్ కల్యాణ్ సంతకం చేసి తిరిగి పోలీసులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment