
వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
– టెక్కలి
చైతన్యదీపం వెలిగించి..
వికేంద్రీకరణకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమై పాటిమీద సెంటర్, ఓవర్ బ్రిడ్జి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, గణపతి సెంటర్ల మీదగా పార్టీ కార్యాలయం వద్దకు చేరకుంది. ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
– నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment