decentralisation
-
సర్వతోముఖాభివృద్ధి దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
-
వికేంద్రీకరణే మా విధానం: సజ్జల
-
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో భారీ సభ
-
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
బిగ్ క్వశ్చన్ : సుప్రీం తీర్పుపై ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
-
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో సత్యాగ్రహ దీక్ష
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
అనంతపురంలో వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం
-
అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు : స్పీకర్ తమ్మినేని
-
బిగ్ క్వశ్చన్ : వికేంద్రీకరణకే జై కొడుతున్న ఏపీ ప్రజలు
-
సీఎం ఎక్కడైనా కూర్చుండి పాలన చేయొచ్చు : సీఎం వైఎస్ జగన్
-
మూడు రాజధానుల కోసం .. తిరుపతి గర్జన
-
‘పాదయాత్ర రద్దుపై విచారణ.. అవసరమైతే పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం’
సాక్షి, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్ర రద్దుతోపాటు దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. పాదయాత్రపై తమ ఆదేశాలను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతించిన 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు పేర్కొంది. పాదయాత్రపై విచారణ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లో 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీలుగా చేర్చారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్‌తో కోర్టుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. తమ ప్రాంత ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారన్న అమర్నాథ్.. వారి మనోభావాలను కోర్టుముందు ఉంచటానికే వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలు మేం చెప్పకుండా ఎలా ఉంటాం. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు వింటామని కోర్టు చెప్పింది. అవసరమైతే ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం. కోర్టు ఆదేశాల తరువాత పోలీసులు పాదయాత్రను పరిశీలిస్తే 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవు. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం. కాని అమరావతి రైతులు మాత్రం మేమే బాగుపడాలని అంటున్నారు. రెచ్చగొట్టేలా ఏ పని చేయవద్దని మేం అంటున్నాం.’ అని వ్యాఖ్యానించారు. చదవండి: సీఎం జగన్ సామాజిక సాధికారతకు న్యాయం చేశారు -
ఈ ప్రశ్నలకెవురు జెబాబు సెప్తారు?
ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి? నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది? ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది? పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి? విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా? మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా? ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా? మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?) అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?) – కళింగ కరువోడు -
మూడు రాజధానులపై ఎందుకంత ఆక్రోశం : స్పీకర్ తమ్మినేని
-
రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఏపీకి అన్యాయం జరిగింది : మంత్రి ధర్మాన
-
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
సీఎం వైఎస్ జగన్ తో మంత్రి ధర్మాన భేటీ
-
అమరావతి పాదయాత్రకు రామచంద్రపురం లో నిరసన సెగ
-
విశాఖను పరిపాలన రాజధాని చేయడం ఖాయం : సజ్జల
-
అనాధిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడింది : మంత్రి బొత్స
-
‘ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా..ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు’
సాక్షి, అనకాపల్లి: అనాదిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ప్రాంతానికైనా వలసలు ఉత్తరాంధ్ర నుంచే జరుగుతున్నాయని, అక్షరాస్యతలోనూ ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పరిపాలన రాజధానిని అందరూ నిలబెట్టుకోవాలని.. అప్పుడే మిగతా ప్రాంతాలతో సమానంగా తమ ప్రాంతం ఎదగగలదని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశారని, అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని ప్రస్తావించారు. మిగతా 1,500 కోట్లలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇక పోతే చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ నుంచి అమరావతికి ఖర్చు చేశారని గుర్తు చేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలంటే ఐదు నుంచి ఆరు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా అని, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్ విధానమని స్పష్టం చేశారు. చదవండి: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం ఒక్కటే ‘అమరావతిలో భవనం నిర్మించాలంటే 110 నుంచి 135 అడుగుల లోతు పునాది కోసం తవ్వాలి. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. బడ్జెట్ మొత్తం, జీతాలు సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుంది. నేను చెప్పింది అబద్ధమో.. నిజమో చంద్రబాబు, యనమల రామకృష్ణడు చెప్పాలి. నేను చెప్పింది అబద్ధం అయితే తలదించుకుంటాను. విభజన చట్టంలోనే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ సినిమా నటుడు వచ్చినా ప్రజలు చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదు. చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా ఇంతకంటే ఎక్కువమంది వస్తారు. పాదయాత్రకు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలి. ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పాదయాత్ర జరుగుతున్న సమయంలో బైక్ ర్యాలీలు, నిరసనలు తెలపడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేయాలి. జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా మేము మద్దతుగా ఉంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.