విభజనకు పూర్తి వ్యతిరేకం: భూమన | YSRCP complete against to state Bifurcation, says Bhumana Karunakar reddy | Sakshi
Sakshi News home page

విభజనకు పూర్తి వ్యతిరేకం: భూమన

Published Sun, Jan 19 2014 2:01 AM | Last Updated on Sat, Jun 2 2018 2:23 PM

విభజనకు పూర్తి వ్యతిరేకం: భూమన - Sakshi

విభజనకు పూర్తి వ్యతిరేకం: భూమన

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధంగా, కేవలం ఓట్లు-సీట్ల కోసం సభలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఐదో, పదో ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దుర్మార్గమంటూ తప్పుబట్టారు.
 
 శ్రీకృష్ణ కమిటీ నివేదికకు, పార్లమెంటులో చిదంబరం ఇచ్చిన హామీకి ఈ బిల్లు వ్యతిరేకమని, దాన్ని ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉదయం సభ ప్రారంభమయ్యాక వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకరు పోడియుం వుుందుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అనంతరం భూవున వూట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తవు పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ‘‘సమైక్యాంధ్ర కోసం మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అనేక పార్టీల అధినేతలను కలిశారు.మా పోరాటానికి వుద్దతివ్వా ల్సిందిగా విన్నవించారు.
 
  సమైక్య తీర్మానం చేయూల్సిందిగా సభా నియమావళిలోని 77, 78 నిబంధనల కింద స్పీకర్‌కు నోటీసిచ్చాం. విభజనను వ్యతిరేకిస్తూ 164వ నిబంధన కింద పిటిషన్ సవుర్పించాం. 2013 డిసెంబరు 23, 24 తేదీల్లో రాష్ట్రపతికి అఫిడవిట్లు సవుర్పించాం. అసెంబ్లీ సవూవేశాలు జరిగేందుకు వుుందే సమైక్య తీర్మానం చేయూల్సిందిగా కూడా కోరాం’’ అని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం నిర్ణయుం తీసుకోవడవుంటే రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు కోయుడం కాదన్నారు. ‘‘తండ్రిలాగా నిర్ణయుం తీసుకోవున్నాం. అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే మా అభిప్రాయుం’’ అని భూమన పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనన్నారు.
 
 తెలంగాణ పట్ల తక్కువ భావం లేదు: వుంత్రి శైలజానాథ్ వూట్లాడిన తీరు ఉరికంభమెక్కిన వ్యక్తిని ఉరి తీసే తలారే దీర్ఘాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించినట్టుగా ఉందని భూమన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు నిర్ణయుం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉండి వూట్లాడటం దారుణవున్నారు. 2 కళ్ల సిద్ధాంతంతో టీడీపీ ప్రజల అభిప్రాయూలను గౌరవించడం లేదంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ వాళ్లు ఆత్మను అవ్ముకానికి పెట్టారని దుమ్మెత్తిపోశారు. 2,700 ఏళ్లుగా తెలుగువారు కలిసే ఉన్నారని తెలిపారు. సీమాంధ్రులు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల పట్ల తవుకు ఏనాడూ తక్కువ అభిప్రాయుం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి వైఎస్ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
 
 వైఎస్, జగన్‌లపై అభాండాలా!
 సభలో విభజన చర్చలో పాల్గొంటున్న ఇతర పార్టీల సభ్యులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై, వైఎస్ జగన్‌పై అభాండాలు వేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా కావాలా అన్న వైఎస్‌ను విభజనవాది అని విమర్శిస్తారా అంటూ భూమన మండిపడ్డారు. తెలంగాణ కోసమే ఆయన రోశయ్యు కమిటీ వేశారనడం సరికాదన్నారు. రోశయ్యు కమిటీ వేసిన సందర్భంగా, పరిశీలించాల్సిన వివిధ అంశా లను వివరించి, దర్యాప్తు చేయాలని వూత్రమే వైఎస్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్‌ను తూల నాడుతున్నా, ఆయన ప్రాపకం తో అధికారంలో ఉన్నవారు నిస్తేజంగా ఉండడం చూస్తే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని మరోసారి రుజువవు తోందన్నారు.
 
 నష్టపోతావుని తెలిసీ: ‘‘ఒక ప్రాంతంలో రాజకీయుంగా నష్టపోతావుని తెలిసి కూడా వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్రే కావాలని కోరుతోంది. టీడీపీలో వూత్రం సగం వుంది విభజన కావాలని, మిగతా సగం సమైక్యాంధ్ర అంటున్నారు. వారు కూడా లోపల వూత్రం విభజనే కావాలంటున్నారు’’ అంటూ భూమన ఎద్దేవా చేశారు. తాము టీడీపీలాగా స్వార్థ రాజకీయుం కోసం ఆలోచించలేదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన  చేయుగా, మీ నాయుకుడైన చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించండని డివూండ్ చేశారు.
 
 భూమన ప్రసంగంలోని ప్రధానాంశాలు
     ఇదివరకు ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ లేదా శాసనసభల తీర్మానాలతో ఏర్పడ్డాయి. ఈ బిల్లు అందుకు పూర్తి భిన్నం
     జల వివాద ట్రిబ్యునళ్లున్నా సమైక్య రాష్ట్రంలో కర్ణాటక, మహారాష్ట్రలతో పోరాడుతున్నాం. రాష్ట్రం విడిపోతే ఘర్షణ పడాల్సి వస్తుంది
     హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే 50, 60 ఏళ్లయినా సాధ్యం కాదు. 75 % పన్నులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి
     మా ప్రాంత పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల చుట్టూ తిరగాలా?
     బిల్లుపై చర్చలో పాల్గొనబోం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఓటింగ్‌లో పాల్గొంటాం
 
 ముద్దుకృష్ణమ వ్యాఖ్యలతో స్తంభించిన సభ
 టీడీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు ముద్దు కృష్ణమ శనివారం శాసనసభలో వైఎస్సార్‌సీపీ పక్ష నాయకురాలు విజయమ్మ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సభ స్తంభించింది. బాబును ఓడించడం కష్టసాధ్యమని భావించే వైఎస్.. చిన్నారెడ్డి నేతృత్వంలో 41 మంది ఎమ్మెల్యేలతో సోనియాకి లేఖ ఇప్పించారని ముద్దుకృష్ణమ విమర్శించారు. చర్చ సమయంలో సభలో ఉంటే సోనియా పీకనొక్కుతారన్న భయం తో విజయమ్మ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
 
  దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి తమ శాసనసభా పక్ష ఉపనాయకురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత కూడా వారు అదే డిమాండ్ చేశారు. పోడియం వద్దే నిల్చుని.. ‘బాబు తన వైఖరి వెల్లడించాలి.. 2 కళ్ల సిద్ధాంతం నశించాలి.. సభ్యుల హక్కులు కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement