
అభిమానులతో కలిసి పుట్టిన రోజు కేక్ కట్ చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, చిత్రంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణలు, అభిమానుల అప్యాయతలు, అభినందనల నడు మ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరి గాయి. పద్మావతీపురంలోని భూమన ఇల్లు గురువారం ఉదయం 7 గంట లకే పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలా డింది. మల్లం రవిచంద్రారెడ్డి, కొమ్ము చెంచయ్య, దుదే ్దల బాబు తదితర సన్నిహితులు తెచ్చి న 60 కిలోల కేక్‌ను భూమన కట్ చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. పార్టీ యువజననేత ఇమాం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను భూమన ప్రారంభించారు. వివిధ సందర్భాల్లో తీసిన భూమన కరుణాకర రెడ్డి ఫొటోలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు.
సంప్రదాయబద్ధంగా షష్టిపూర్తి...
ఉదయం 9 గంటలకు ఆవరణలో షష్టిపూర్తి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లిపీటలపై కూర్చున్న భూమన దంపతులను హాజరైన ప్రముఖులందరూ ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, రైల్వేకోడూరు, సూళ్లూరుపేట శాసనసభ్యులు కళత్తూరు నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, కిలివేటి సంజీవయ్య ఈ కార్యక్రమానికి హాజరై భూమన దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీటీడీ వేదపండితులు, ప్రధానార్చకులు రమణ దీక్షితులు, డాలర్ శేషాద్రి కూడా హాజరై భూమన దంపతులను ఆశీర్వదించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా వేడుకల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను సమకూర్చారు. వైఎస్సార్‌సీపీకి చెందిన శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాస్, ఆదిమూలం, పోకల అశోక్‌కుమార్, బాలిశెట్టి కిషోర్, దామినేటి కేశవులు, కేతం జయచంద్రారెడ్డి, ఎస్‌కే బాబు, చిత్తూరు బీజేపీ నేత సీకే బాబు, తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, శాం తారెడ్డి, భూమన స్నేహితుడు సైకం జయచంద్రారెడ్డి, జనసేన యువనేత కిరణ్‌రాయల్ తదితరులు భూమనకు అభినందనలు తెలిపారు. మ«ధ్యాహ్నం 3 గంటల వరకూ ఆహూతులందరికీ విందు భోజన ఏర్పాట్లు చేశారు.