జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు | CM YS Jaganmohan Reddy Birthday Celebrations All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు

Published Wed, Dec 22 2021 3:20 AM | Last Updated on Wed, Dec 22 2021 5:02 AM

CM YS Jaganmohan Reddy Birthday Celebrations All Over Andhra Pradesh - Sakshi

కృష్ణా జిల్లా పామర్రు మండలం నల్లగుంటలో వరి కోత పనులకు వెళ్లిన కూలీలు మంగళవారం సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. కేక్‌ కట్‌ చేశారు.

సాక్షి నెట్‌వర్క్‌: ‘జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు’ అని ఆశీర్వదిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసి వివిధ సేవా కార్యక్రమాలు జరిపారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. కొన్నిచోట్ల నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. అనేకచోట్ల సీఎం వైఎస్‌ జగన్‌ అభిమానులు రక్తదాన కార్యక్రమాలు జరిపారు. పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.

సీఎం నివాసంలో..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను తాడేపల్లిలోని ఆయన నివాసంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌తో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వి.బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ అజేయకల్లం, ప్రభుత్వ చీఫ్‌ అడ్వైజర్‌ ఆదిత్యనాథ్‌దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ్‌రెడ్డి, సమాచారశాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, శామ్యూల్, ఎమ్మెల్సీ టి.మాధవరావు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీపీఆర్వో పూడి శ్రీహరి ఉన్నారు.


వెల్లువెత్తిన సేవా కార్యక్రమాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా జరిగాయి. సీఎం జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాలు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, వృద్ధులకు పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. వివిధ నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. పేదలకు చీరలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మెగా వైద్య శిబిరం, మెగా రక్తదాన శిబిరాలు, విద్యార్థుల క్రీడా పోటీలు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో అనేకచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీ, యాగాలు, పూజలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు, లక్ష చామంతి పూజ, శత చండీ యాగం, మెగా మెడికల్‌ క్యాంప్‌ తదితర కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పేదలకు దుస్తుల పంపిణీ, రక్తదాన శిబిరాలు, సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న సంపూర్ణ శాశ్వత గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ, రక్తదాన శిబిరాలు, విభిన్న ప్రతిభావంతులకు పండ్లు, స్వీట్లు, విద్యార్థులకు టిఫిన్‌ బాక్సులు, పుస్తకాలు, వృద్ధులకు దుప్పట్లు, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు.


మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రక్తదాన, వైద్య శిబిరాలు, జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు, వృద్ధులకు దుస్తుల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో వడి బియ్యం పేరిట వెయ్యి మంది మహిళలకు పట్టు చీరలు, సాధారణ చీరలు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, పేదలకు దుప్పట్లు, చీరలు, పండ్లు, రొట్టెలు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌ పంపిణీ, కడపలో వైఎస్‌ విజయమ్మ పార్క్‌ ప్రారంభోత్సవం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు, వృద్థులకు చీరలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ జరిగాయి. మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 2,969 మంది రక్తదానం చేశారు. జెడ్పీ డ్రైవర్లు, అటెండర్లకు యూనిఫామ్‌ పంపిణీ చేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో సీఎం జగన్‌ పేరిట ప్రత్యేక హోమం, పూజలు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించగా, పుట్టపర్తిలో 3కే మారథాన్‌ జరిగింది. మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి మొక్కలను నాటారు. సభా వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌ ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహనరావు, మేరుగ నాగార్జున, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

ఎల్లలు దాటిన అభిమానం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి నేతృత్వంలో పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, సంజీవ్‌కుమార్, గురుమూర్తి, తలారి రంగయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్‌.రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌లోను, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోను 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. లేపాక్షి డైరెక్టర్‌ ఆళ్ల శివగణేష్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు.
పార్లమెంట్‌లోని పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు 

కువైట్‌లో ఘనంగా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్‌ అవినాష్‌ యూత్‌ ఆధ్వర్యంలో కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పులివెందుల జిలన్‌ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్‌ డేగ ఫిలిం, రైజ్‌ వన్, అభిమానులు పాల్గొన్నారు.   

రావి ఆకుపై సీఎం చిత్రం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వేమూరు నియోజకవర్గ నాయకుడు కారుమూరు వెంకటరెడ్డి రావి ఆకుపై ముఖ్యమంత్రి చిత్రాన్ని వేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
– కొల్లూరు 

స్కూబా డైవింగ్‌ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు
తమిళనాడులో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్న నెల్లూరుకు చెందిన సుప్రీత్‌..  మహారాష్ట్రలోని చివల బీచ్‌లో సముద్రంలో 80 మీటర్ల లోతున స్కూబా డైవింగ్‌ చేస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  
– నెల్లూరు (వీఆర్సీసెంటర్‌)

పారాగ్లైడింగ్‌లో విహరిస్తూ వేడుకలు
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన సింగారెడ్డి వాసు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని పారా గ్లైడింగ్‌లో నిర్వహించారు. ఆకాశంలోనే జగనన్న ఫొటోను ప్రదర్శిస్తూ మిత్రులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.
– అనుమసముద్రంపేట 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement