'చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర' | 'The bloody history of Chandrababu' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర'

Published Thu, Apr 30 2015 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి

అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రక్తంతో తడిసిన చరిత్ర అని వైఎస్ఆర్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ చేపట్టాలని వారన్నారు. రాప్తాడులో నిన్న ఉదయం హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు పరామర్శించారు. పరామర్శించినవారిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత వెంకటరామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్ది, అమర్నాథ రెడ్డి, తిప్పారెడ్డి, వై. విశ్వేశ్వర రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చాంద్ బాషా,కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి, పోతుదుర్తి ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి, భూమన మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని చెప్పారు.

వైఎస్ఆర్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు హత్యాకాండకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement