వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో శనివారం చేపట్టనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వేలాది మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు.
=సమైక్య శంఖారావానికి తరలివెళ్లిన సమైక్యవాదులు
=రెండు ప్రత్యేక రైళ్లు, వందలాది బస్సులు, వ్యాన్లు ఏర్పాటు
=వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, వివిధ జేఏసీల నేతలు, విద్యార్థులు వెళ్లిన వైనం
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో శనివారం చేపట్టనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వేలాది మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు. రెండు ప్రత్యేక రైళ్లు, వందలాది బస్సులు, జీపులు, కార్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు, విద్యార్థు లు వెళ్లారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో 60 బస్సులు, చిత్తూరు నుంచి వచ్చిన ప్రత్యేక రైలులో ఆరు బోగీల్లో ఆరు వందల మందికిపైగా వెళ్లారు.
తిరుపతి నుంచి వెళ్లిన కార్యకర్తలకు పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీల కులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వీడ్కోలు పలికారు. ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, ఎస్‌వీయూ విద్యార్థులను ఆయన అభినందించారు. చంద్రగిరి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలును ఆ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చెవిరెడ్డి నాయకత్వంలో పది బోగీల్లో వెయ్యి మందికి పైగా బయలుదేరి వెళ్లారు. పది కార్లు కూడా వెళ్లాయి. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నాయకత్వంలో 25 బస్సులు, 50 కార్లలో సమైక్యవాదులు బయలుదేరి వెళ్లారు. రెండు రైలు బోగీల్లోనూ ఇక్కడివారు వెళ్లారు.
నగరి నుంచి ఏడు బస్సులు వెళ్లాయి. సత్యవేడు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నాయకత్వంలో ఎనిమిది బస్సులు, పది వ్యాన్లు బయలుదేరాయి. చిత్తూరు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వలో పది బస్సులు, పది కార్లు, జీపులు వెళ్లాయి. రైలులో ఆరు బోగీల్లో ఇక్కడి నుంచి వెళ్లారు. గంగాధర నెల్లూరుకు చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజలు నాలుగు రైలు బోగీలు, ఎనిమిది బస్సులు, పది కార్లలో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో వెళ్లారు. మండల కన్వీనర్లు ధనంజయరెడ్డి, సురేష్‌రెడ్డి రెండు వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు.
పార్టీ నాయకుడు విజయనాథరెడ్డి ఎస్‌ఆర్‌కుప్పం నుంచి మూడు మినీ బస్సులు, రెండు కార్లతో బయలుదేరారు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో 20 బస్సులు, మరో 50 వ్యాన్లు బయలుదేరాయి. పలమనేరు నుంచి మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నేతృత్వంలో 12 బస్సులు, రెండు రైలు బోగీలు, పది కార్లు బయలుదేరాయి.
మదనపల్లె నుంచి ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో 18 బస్సులు, 14 కార్లు, నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం నేతృత్వంలో ఐదు బస్సులు, 25 సుమోలు, పార్టీ మైనారిటీ నాయకుడు అక్బర్ అహ్మద్ నాయకత్వంలో ఆరు బస్సులు, ఐదు సుమోలు, పార్టీ నాయకుడు బాబ్‌జాన్ నేతృత్వంలో పది బస్సులు బయలుదేరాయి. పీలేరు నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి నాయకత్వంలో 15 బస్సులు వెళ్లాయి.
శ్రీకాళహస్తి నుంచి పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ఐదు బోగీలు బయలుదేరి వెళ్లారు. పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సునీల్‌కుమార్, పుణ్యమూర్తి, రవిప్రసాద్, పూర్ణం ఎనిమిది బస్సులు, రెండు రైలు బోగీలు, పది కార్లలో హైదరాబాద్‌కు బయలుదేరారు. కుప్పం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో ఐదు బస్సులు వెళ్లాయి.
భారీ స్పందన : నారాయణస్వామి
వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి భారీ స్పందన లభించిందని జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి తెలిపారు. జిల్లా నుంచి వేలాది మంది బయలుదేరడం ఆనందంగా ఉందన్నారు. ఏర్పాట్లకు కృషి చేసిన పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మిథున్‌రెడ్డి, వరప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య శంఖారావం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.