‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’ | bhumana karunakara reddy blames sonia gandhi | Sakshi
Sakshi News home page

‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’

Published Thu, Aug 15 2013 2:48 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’ - Sakshi

‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’

సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే కారణమని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.

తిరుపతి: సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే కారణమని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నూత్నంగా  నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజల  కళ్లలో సోనియా గాంధీ కారం కొట్టారనే పొట్లాలను భూమన పంపిణీ చేశారు.
 
 
 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు సోనియానే ప్రధాన కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆమె దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement