అధికారులపై మండిపడుతున్న ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి : ‘రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రిని భ్రష్టుపట్టించారు..గత ప్రభుత్వ హయాంలో నిధులను అడ్డంగా దోచుకున్నారు.. ఇక మీ ఆటలు సాగవు..మీరు మారి ఆస్పత్రి నిర్వహణలో మార్పు తీసుకురండి..లేకపోతే చర్యలు తప్పవు’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆస్పత్రి అధికారులను హెచ్చరిం చారు. రుయాలో కే ట్యాక్స్ వ్యవహారం వెలుగులోకి రావడం.. సూపరింటెండెంట్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం..ఆస్పత్రి అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే సోమవారం ఆస్పత్రిలో పర్యటిం చారు. అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర విభాగాన్ని, కోడెల తనయుడు బినామీ పేరుతో నిర్వహిస్తున్న ల్యాబ్‌ను పరి శీలించారు.
భూమన మాట్లాడుతూ పేద రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన గత పాలకులు రుయా వేదికగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. మీడియాలో రుయా అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. దీనిపై అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ రుయాను సందర్శించి కోడెల తనయు డు కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌ను రద్దు చేయాలని ఆదేశించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా అవినీతి అక్రమాల్లో మార్పు రాలేదా అని నిలదీశారు. మాజీ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రోగులకు అన్యాయం చేస్తూ అక్రమార్కులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. ఇక అవినీతికి ముగిం పు పలికి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
సెంట్రల్ ల్యాబ్ నిర్వహణను తక్షణం మెడికల్ కళాశాల, రుయా సంయుక్తంగా నిర్వహించాలని ఆదేశించారు. జనరిక్ మందుల షాపులు కేటాయించాలని నెలన్నర క్రితం ఆదేశాలు వచ్చినా అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రుయా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుయా ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ సరస్వతీదేవి, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీహరి, సీఎంఓ డాక్టర్ వెంకట్రమణ, రుయా వర్కింగ్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ హేమకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కే బాబు, ఎంఎస్ మణి, పి.రాజేంద్ర, హి మాం సాహెబ్, నరేంద్రనా«థ్ కుసుమకుమారి, లక్ష్మీరెడ్డి, శ్రీదేవి, కిరణ్, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment