
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా వాసులుకు వరం ప్రకటించాలని నిర్ణయించింది. టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తిలో జిల్లా వాసులుకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమాన్ కరుణాకర్ రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీటీడీ పాలనమండలి.. ప్రభుత్వ అనుమతులకు పంపింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇప్పటి నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో అధిక భాగం జిల్లా వాసులకు దక్కే అవకాశం ఉంది. తాజా నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment