ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తోన్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. తుపాను ఘటనను చంద్రబాబు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రసాద మాధ్యమాల యావలో పడ్డారని, నిరసన తెలుపుతున్న బాధితులను తాట తీస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడిని దుయ్యబట్టారు. నిరసన తెలుపుతున్న బాధితుల ఫోటోలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుబారా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.