రాష్ట్ర విభజనకు నిరసనగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.
చిత్తూరు: రాష్ట్ర విభజనకు నిరసనగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. తుడా సర్కిల్‌లో ఆయన బూట్ పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు చెందిన విద్యావంతులు కార్మికులుగా మారతారని హెచ్చరించారు.
రాష్ట్రానికి హైదరాబాద్ తలమానికంలాంటిదని చెప్పారు. హైదరాబాద్ లేని సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. సీమాంధ్ర మరో హితోఫియాలా మారుతోందన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం అన్నారు.