
ఆ డబ్బులిస్తే ‘ఈనాడు’లో వైఎస్ జగన్‌కు అనుకూలంగా రాస్తానన్నారు
ప్రమాణం చేసి కాదని చెప్పగలరా?
రామోజీరావుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సవాల్
సినిమా టికెట్ కోసం రూ.2 దొంగిలించిన దొంగ బాబు
సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మనవళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్నమాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు.
1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment