
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజా వంచన తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు తన అనుభవాన్నాంతా స్వార్థం కోసం వాడుకున్నారు తప్పా రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు.
ఆరువందలకు పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. రైతులు,డ్వాక్రా మహిళలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ మోసం చేశారని ఆరోపించారు. తన పాలనలో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు.