టీడీపీ గోడలను బద్దలు కొట్టగల ధీరుడు ఆయనే.. | YS Jagan Mohan Reddy Break The TDP Walls With A Bare Hands | Sakshi
Sakshi News home page

టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌జగన్‌..

Published Wed, May 2 2018 2:18 PM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM

YS Jagan Mohan Reddy Break The TDP Walls With A Bare Hands - Sakshi

భూమన కరుణాకర్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, కడప : ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ గోడలను ఆయన ఇప్పటికే బద్దలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌ను వ్యతిరేకించే వాడు మానవ ద్వేషి అయి ఉంటాడని భూమన అన్నారు. మహానేత వైఎస్‌ఆర్‌  ఆలోచనలే తమ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. సిద్ధాంతం లేదని విమర్శించే వారికి ఇదే తమ సమాధానమని భూమన పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి పరిపూర్ణ ఆలోచన ఉందని, రాజకీయం అంటే అధికారం అనే సిద్ధాంతం చంద్రబాబుదని విమర్శించారు. 

జీవితాంతం గర్వపడేలా చెప్పుకునే నాయకుడు జగన్‌ అని, అధికారం ఒకరు వేస్తే తీసుకునే భిక్ష కాదని, పోరాడి సాధించుకునే హక్కు అన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని భూమన పేర్కొన్నారు. 10 జన్‌పథ్‌లో నిటారుగా వైఎస్‌ జగన్‌ నిల్చున్నారని, వందసార్లు కుంగదీయడానికి ప్రయత్నించినా లొంగని మనిషిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా.. తండ్రి ఆశయ సాధన కోసం జగన్‌ పోరాటం చేస్తున్నారని, అటువంటి నేతకు మనం చేదోడు వాదోడుగా ఉందామని పిలుపునిచ్చారు. 5 కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్‌ పాలనను అందిద్దామని భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement