సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జిల్లాలోని జాతీయ రహదారులన్నీ మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు, మదనపల్లెలో పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తిలక్‌రోడ్డులోని సెంట్రల్ పార్కు ఎదుట రాస్తారోకో చేశారు.
చంద్రగిరి నాగాలమ్మ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి-చిత్తూరు రోడ్డును దిగ్బంధించారు. 50 ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు. నేండ్రగుంట వద్ద చిత్తూరు రోడ్డుపై షామియానాలు వేసి, రోడ్డుపైనే భోజనాలు చేశారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో మురకంబట్టులోని చిత్తూరు-తిరుపతి రోడ్డు, వరిగిపల్లెలోని చిత్తూరు-బెంగళూరు రోడ్డు, కలెక్టరేట్ వద్ద వేలూరు రోడ్డును, యాదమరి వద్ద చిత్తూరు-పుత్తూరు రోడ్డును దిగ్బంధించారు.
కలెక్టరేట్, యాదమరి వద్ద పార్టీ న గర కన్వీనర్ రఘునాథరెడ్డి, పలువురు కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నాయకత్వంలో పుంగనూరు, తిరుపతి రోడ్లను దిగ్బంధించారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడిచి పెట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో చెన్నై-బెంగళూరు రోడ్డును దిగ్బంధించారు. పార్టీ నాయకురాలు ఆశాలత కూడా పాల్గొన్నారు. బెరైడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో పార్టీ నాయకులు కృష్ణమూర్తి, శంకర్‌రెడ్డి నాయకత్వంలో రహదారులను అడ్డుకున్నారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఎంబీటీ, బెంగళూరు, చింతామణి, తిరుపతి రోడ్లను దిగ్బంధించారు. లిడ్‌కాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, నాగరాజురెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉదయం 5గంటలకే చెట్లను రోడ్డుపై పడేసి, రాకపోకలను అడ్డుకున్నారు. కుప్పంలో వేదాంగంపల్లె, ప్రభుత్వాస్పత్రి , తంబిగానిపల్ల్లె వద్ద అడ్డుకున్నారు. శాంతి పురం, గుడుపల్లె మండలాల్లో రహదారులను దిగ్బంధించారు. పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు.
శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాదరావు అధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నగరిలో పార్టీ జిల్లా కన్వీనరు నారాయణస్వామి ఆధ్వర్యంలో పుత్తూరు-నారాయణవనం బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. నగరిలో కేజే కుమార్, భాస్కర్‌రెడ్డి, నిండ్రలో శ్యామ్‌లాల్, వడమాలపేటలో ఉమాపతి నాయకత్వంలో రహదారులను అడ్డుకున్నారు.
సత్యవేడులో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనం- నాగలాపురం రోడ్డు, పిచ్చాటూరులోని చెన్నై జాతీయ రహదారులను దిగ్బంధించారు. పూతలపట్టులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి, నాయకులు రాజరత్నంరెడ్డి, సమన్వయకర్తలు రవిప్రసాద్, పూర్ణం రంగంపేట క్రాస్ వద్ద బైఠాయించారు. పూతలపట్టులో సుబ్బారెడ్డి, వినయ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి చిత్తూరు రోడ్డుపై బైఠాయించారు. బంగారుపాళ్యంలో పార్టీ సమన్వయకర్త సునీల్‌కుమార్ నాయకత్వంలో బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిని, తవణంపల్లిలో సమన్వయకర్త రవిప్రసాద్ చిత్తూరు-అరగొండ రోడ్డును దిగ్బం ధించారు.
వెదురుకుప్పం మండలంలో పేట ధనంజయరెడ్డి, కార్వేటినగరంలో శ్రీరాములునాయుడు, జీడీనెల్లూరులో తమ్మిరెడ్డి, పెనుమూరులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నరసిం హులు, ఎస్‌ఆర్‌పురంలో అనంతరెడ్డి, పాలసముద్రంలో సుందరరాజులు ఆయా మండలాల్లోని రోడ్డుపై బైఠాయించారు. వాల్మీకిపురంలో పార్టీ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి నాయకత్వంలో తిరుపతి-మదనపల్లె రహదారిని అడ్డుకున్నారు. తంబళ్లపల్లెలో పార్టీ నాయకులు మాధవరెడ్డి, రవీందర్‌రెడ్డి ములకలచెరువు రోడ్డును దిగ్బంధించారు.
చిత్తూరు, మదనపల్లెలో వైఎస్సార్ సీపీ నాయకుల అరెస్ట్
Published Thu, Nov 7 2013 5:12 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement