
'అసెంబ్లీ సాక్షిగా విభజన ద్రోహులు ఒక్కటయ్యారు'
అసెంబ్లీ సాక్షిగా విభజన ద్రోహులు ఒక్కటయ్యారని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
అసెంబ్లీ సాక్షిగా విభజన ద్రోహులు ఒక్కటయ్యారని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు మరోసారి అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డాయని అన్నారు. కాంగ్రెస్తో టీడీపీ కుమ్మకై వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.
స్పీకర్ తనకున్న విశేష అధికారాలు ఉపయోగించి విభజనపై ముందు అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని ఆ తర్వాత చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్లకు భూమన విజ్ఞప్తి చేశారు. ఓటింగ్కు అంగీకరించకుంటే తాము చర్చకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రేపు కూడా సభా కార్యాక్రమాలను అడ్డుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీని కాంగ్రెస్ అధిష్టానానికి దాసోహం చేశారని ఎద్దేవా చేశారు.